కారును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం.. ఇద్దరు యువకుల దుర్మరణం

  • శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిలో ప్రమాదం
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈరటోనిపల్లి గేటు వద్ద ఘటన
  • మృతుల వివరాలు తెలియాల్సి ఉంది
ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న ప్రణయ్‌ (20), మహేశ్‌ (22) అనే ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. శ్రీశైలం- హైదరాబాద్‌ ప్రధాన రహదారిలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతల మండలం ఈరటోనిపల్లి గేటు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన ఇద్దరు యువకులు హైదరాబాద్‌ వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వీరెవరు, ఎక్కడి వారన్న వివరాలు తెలియరాలేదని, ఘటనా స్థలి నుంచి మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని ఉప్పునూతల పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Road Accident
two died
Nagarkurnool District

More Telugu News